![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-728లో.. యామిని, రుద్రాణి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. కావ్య, అపర్ణల మధ్య ఉన్న సంబంధం రాజ్ కళ్లముందే బయటపడటానికి నా మనిషిని ఒకరిని అక్కడికి ఒక ఆఫీసర్ లా పంపిస్తాను. అతడు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా నటించి.. ఎవరికి ఎవరు ఏం అవుతారో అనే వివరాలు లాగుతాడు.అప్పుడు రాజ్ ముందే అపర్ణ గారు కళావతికి అత్త అన్న నిజం బయటపడుతుంది. కొడుకు పెళ్లామనే నిజం బయటపడుతుంది.. అప్పుడు రాజ్ నిజం తెలుసుకుని అందరిని తిట్టి నా దగ్గరకు వచ్చేస్తాడని యామిని తన ప్లాన్‌ని రుద్రాణికి చెప్తుంది.
మరోవైపు కావ్య కోసం రాజ్ లవ్ లెటర్ రాస్తాడు. అది ఫన్నీగా ఉంటుంది. అయితే లెటర్ చివర్లో కళ్యాణ్ అని రాసి ఉండటంతో అది చూసి కావ్య విసుగ్గా రాజ్ కి ఇచ్చేసి తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ పేరు చూసి రాజ్ కోపంతో.. ఒరేయ్ కళ్యాణ్ అంటూ తన వెంటపడతాడు. సారీ అన్నయ్య అలవాటులో పొరపాటుగా నా పేరు రాశేసానని కళ్యాణ్ చెప్పినా రాజ్ వినడు. ఇక కళ్యాణ్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర కిందపడేసి ఎంతపనిచేశావ్ రా అని రాజ్ అంటుంటే.. అపర్ణ, ఇందిరాదేవి ఆపేస్తారు. ఇక వారికి సారీ చెప్పేసి కొత్త ప్లాన్ చెప్పమంటాడు రాజ్. కాసేపు ఆలోచించిన రాజ్ నాకో కొత్త ఐడియా వచ్చిందని అనగానే.. హా ఏంటి అది అని కళ్యాణ్ అంటాడు. హా చెప్తే దాని మీద కూడా సంతకం చేస్తావా అంటూ కళ్యాణ్ మీద కోప్పడతాడు రాజ్. అదంతా దూరం నుండి కావ్య చూసి నవ్వుకుంటుంది.
ఇక కావ్యకి కాల్ చేస్తుంది యామిని.నీది అధర్మం.. నాది ధర్మం.. నేనే గెలుస్తానంటూ యామినిని రెచ్చగొట్టేలా కావ్య మాట్లాడుతుంది. అదే సమయంలో కావ్యకి సారీ చెప్తూ రాజ్ తనవెంట పడతాడు. రుద్రాణి, ఇందిరాదేవి అంతా రాజ్ కి సపోర్ట్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. ఇక చివరికి కావ్య నవ్వేసరికి.. నవ్వింది.. కళావతి నవ్వింది అంటు రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో యామిని మనిషి జనాభా లెక్కల మనిషిలా ఇంటికి వస్తాడు. అతనికి రుద్రాణి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |